Sriram Multi Super Speciality Hospital, Ongole, marked Vinayaka Chavithi with a week of devotion, music, and community gathering. This was the hospital’s 13th year of celebrating Lord Ganesha with staff, doctors, and families from Satyanarayanapuram.
Special pujas were held twice a day throughout the week. The hospital campus stayed festive with bhakti and a shared sense of unity. On Sunday, the Vinayaka nimajjanam (immersion) was held with great enthusiasm, followed by an annadanam (community meal) and a joyful laddu auction won by local Satyanarayanapuram residents. Songs and dances then closed the celebrations.
These Vinayaka Chavithi celebrations brought everyone to one place and remain a sweet memory for the Sriram Hospital family. Ganapati Bappa Morya!
Highlights from the week-long Vinayaka Chavithi pujas, immersion, annadanam, and laddu auction at Sriram Hospital, Ongole.
Dr. Chapala Vamsi Krishna (also searched as Dr. Chapla Vamsi Krishna), MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK-trained in Spine & Joint Replacement Surgery, Chief Joint Replacement Surgeon, Sriram Multi Super Speciality Hospital, Ongole.
శ్రీరామ్ హాస్పిటల్‌లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
ఒంగోలులోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వారం రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి.
13 వ సంవత్సరం జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ రెండు పూటలా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, స్థానిక సత్యనారాయణపురం వాసులు పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. హాస్పిటల్ ప్రాంగణం మొత్తం భక్తి, ఆధ్యాత్మికతతో కళకళలాడింది.
ఆదివారం నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు ఉత్సాహంగా లడ్డూ వేలంపాటలో పాల్గొనగా, స్థానిక సత్యనారాయణపురం వాసులు లడ్డూను సొంతం చేసుకున్నారు.
అనంతరం పాటలు, నృత్యాలతో హాస్పిటల్ సిబ్బంది, స్థానికులు సందడి చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ఆనందోత్సాహాలతో ముగించారు.
🙏 భక్తి… ఐక్యత… సంతోషం… అందరినీ ఒక్కచోట చేర్చి ఆనందాన్ని పంచిన ఈ వినాయక చవితి వేడుకలు శ్రీరామ్ కుటుంబ సభ్యులందరికీ మధుర జ్ఞాపకంగా నిలిచాయి.
గణపతి బప్పా మోరియా!
డాక్టర్ చాపల వంశీ కృష్ణ, MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK Trained in Spine & Joint Replacement Surgery, చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు.
For appointments, visit the Doctors page or call the 24/7 helpline 81848 28282.