Dr. Chapala Vamsi Krishna, Senior Chief Joint Replacement Surgeon at Sriram Multi Super Speciality Hospital, Ongole, has been recognised by the prestigious Asia Book of Records.
The honour is for conducting the highest number of Bone Mineral Density (BMD) screening camps to prevent osteoporotic bone fractures.
Since 2010, Dr. Vamsi Krishna has held BMD screening camps every month without a break. The goal is to test bone density, find osteoporosis (weak bones) early, and teach people how to lower the risk of future fractures.
This public-health work was recorded for the highest number of BMD screening camps on 3 December 2025. Asia Book of Records representatives later visited Sriram Hospital, Ongole, and presented the certificate.
This recognition marks Dr. Vamsi Krishna’s long effort to find bone disease early and stop fractures before they happen.

Doctors and friends congratulated Dr. Vamsi Krishna on this special milestone.
Dr. Chapala Vamsi Krishna (also searched as Dr. Chapla Vamsi Krishna), MS (Ortho) Osmania, M.Ch (Ortho), UK-trained in Spine & Joint Replacement Surgery, Chief Joint Replacement Surgeon, Sriram Multi Super Speciality Hospital, Ongole.
డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారికి ప్రతిష్ఠాత్మకమైన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (Asia Book of Records) గుర్తింపు!
ఆస్టియోపోరోటిక్ బోన్ ఫ్రాక్చర్ల నివారణ కోసం అత్యధిక బోన్ మినరల్ డెన్సిటీ (BMD) స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించినందుకు గుర్తింపు!
ఒంగోలులోని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన సీనియర్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారికి ప్రతిష్ఠాత్మకమైన Asia Book of Recordsలో చోటు లభించింది.
ఎముకల సాంద్రతను పరీక్షించి, ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) కారణంగా భవిష్యత్తులో ఎముకలు విరిగే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, వాటిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో డాక్టర్ వంశీ కృష్ణ గారు 2010 నుంచి ప్రతి నెలా నిరంతరాయంగా BMD స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
ఈ నిరంతర ప్రజారోగ్య సేవల్లో భాగంగా, డాక్టర్ చాపల వంశీ కృష్ణ గారు 2025 డిసెంబర్ 3న అత్యధిక సంఖ్యలో నిర్వహించిన బోన్ మినరల్ డెన్సిటీ స్క్రీనింగ్ క్యాంపులలో పాల్గొన్నందుకు ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది.
ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు శ్రీరామ్ హాస్పిటల్కు విచ్చేసి డాక్టర్ వంశీ కృష్ణ గారికి సర్టిఫికెట్ను అందజేశారు.
"ఎముకల ఆరోగ్యంపై అవగాహన – ఫ్రాక్చర్ల నివారణ – ఆరోగ్యకరమైన జీవనం" అనే అంశంపై ఆయన చేస్తున్న నిరంతర కృషికి ఈ గుర్తింపు ఒక ప్రత్యేక మైలురాయి. వైద్యులు, మిత్రులు డాక్టర్ వంశీ కృష్ణ గారిని అభినందించారు.
For appointments, visit the Doctors page or call the 24/7 helpline 81848 28282.